కథువా కేసు : ఈ నెల 28కి వాయిదా

SMTV Desk 2018-04-16 18:40:34  kathua incident, supreme court, jammu kashmir, chandigarh

జమ్మూకశ్మీర్, ఏప్రిల్ 16 : జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలోని జరిగిన విషాదకర ఘటనపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నిందుతులను కఠువాలో చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నిందితులు అందరికి చార్జిషీటు కాపీలను అందజేయాలని ప్రాసిక్యూషన్ న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. మరోవైపు ఈ కేసు విచారణను చండీగఢ్‌ కోర్టుకు బదలాయించాలని దాఖలైన పిటిషన్‌పై ఏప్రిల్‌ 27లోగా బదులివ్వాలని జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది జనవరిలో లైంగిక దాడి, హత్యకు గురైన ఎనిమిదేళ్ల చిన్నారి తరపు న్యాయవాదికి, బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్దానం ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌ వెలుపల తమ కేసును విచారించాలని, తమ కుటుంబంతో పాటు కేసును వాదిస్తున్న తమ న్యాయవాదులకు భద్రత కల్పించాలని పిటిషన్‌లో బాధితురాలి తండ్రి కోర్టును కోరారు. ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన మైనర్‌ బాలుడిని ఉంచిన జువెనిల్‌ హోంలో భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించాలని కూడా ఆయన కోరారు. ఈ కేసులో ఒక బాలనేరస్థుడు సహా 8 మంది నిందితులున్నారు.