జయప్రద గా తమన్నా.!!!

SMTV Desk 2018-04-16 18:08:15  tamanna, tamanna in ntr film, tamanna in jayaprada character

హైదరాబాద్, ఏప్రిల్ 16 : టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల హవా కొనసాగుతోంది. దానికి తోడు నటీనటులు సైతం బయోపిక్ లకు సై అంటున్నారు. తాజాగా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా దృష్టి కూడా బయోపిక్ లపైనే ఉన్నట్లుంది. ఇటీవల చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహారెడ్డి" లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదండోయ్.. మరో బయోపిక్ లో ఈ భామ నటించనున్నట్లు సమాచారం. నందమూరి తారక రామారావు జీవితచరిత్ర అయిన "ఎన్టీఆర్" చిత్రంలో తమన్నా సీనియర్ హీరోయిన్ జయప్రద పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలో ప్రధాన తారాగణాన్ని ఫిక్స్ చేశారు. ఈ పాత్ర కోసం ఇప్పటికే పలువురు భామలను సంప్రదించినట్లు సమాచారం. కాని ఆ అదృష్టం తమన్నాను వరించింది. దీంతో జయప్రద పాత్రలో తమన్నా అభిమానులను అలరించడానికి రెడీ అవుతుందన్నమాట.