"భరత్" ప్రచారానికి అన్ని కోట్లా..!

SMTV Desk 2018-04-16 16:28:27  bharath ane nenu, bharath ane nenu promotions, 3 crores .

హైదరాబాద్, ఏప్రిల్ 16 : మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న "భరత్ అనే నేను" చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. మహేష్ తొలిసారిగా పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యంలో సినిమా చేస్తుండడం విశేషం. ఇంతకి తాజా సమాచారం ఏంటంటే.. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు సమాచార౦. అంతేకాదు నగరంలో ఏకంగా 200 హోర్డింగ్ లు పెట్టేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికలు వేస్తోంది. ఇటీవల భరత్ అనే నేను చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ఎల్బీనగర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడమంటే మాటలు కాదు. ఇది ఒక రికార్డ్ గా చెప్పుకోవచ్చు. విడుదలకు ముందే ఇన్ని రికార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.