పాక్ మోడల్ పై కేసు నమోదు

SMTV Desk 2017-07-04 14:36:18  pakistan, model, ayyan ali, smagling

ఇస్లామాబాద్ జూలై 04 : మోడల్ గా ప్రేక్షకులను అలరిస్తున్న పాకిస్తాన్ మోడల్ అయ్యన్ అలీ డబ్బుకి కక్కుర్తిపడి కరెన్సీ స్మగ్లింగ్ చేయడం సంచలనం రేపింది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులకు అలీ బ్యాగ్ లో 506,000 డాలర్లు లభించాయి. అధికారులు డాలర్లను స్వాధీనం చేసుకొని నిందితురాలిని కస్టమ్స్ కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెను అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ చేసారు. కాగా ఇప్పడికే ఈ ముద్దుగుమ్మ దుబాయ్ లో కూడా స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కి నాలుగు నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు.