కథువా రేప్ కేసులో కొత్త మలుపు...స్థానికుల సమాచారం కీలకం

SMTV Desk 2018-04-16 14:34:18  kathua rape incident, jammu kashmir, rasoova village,

జమ్మూకశ్మీర్, ఏప్రిల్ 16 : ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులోనే ఆడపిల్లలుకు రక్షణ కరువైంది. అభం శుభం తెలియని ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు క్షమించరానివి. ఇటివలే సంచలనం రేపిన కథువా బాలిక అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే ప్రదేశమైన దేవాలయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అమానుషం అని పోలీసులు తెలిపారు...కాగా ఈ ఉదంతంపై మరి కొన్ని నిజాలు వెలుగు చూసాయి. కథువా రసానా గ్రామంలోని దేవాలయంలో బాలికను దాచి అత్యాచారం చేసి చంపారని జమ్మూ కశ్మీర్ క్రైంబ్రాంచ్ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్ షీటులో పేర్కొన్నారు. అయితే స్థానిక గ్రామ ప్రజలు మాత్రం అత్యాచారానికి గురైన బాలికను ఆలయంలో దాచడం అసాధ్యమని ముక్తకంఠంతో తెలిపారు. స్థానిక మహిళ వెల్లడించిన వివరాల ప్రకారం.....ఆలయంలోనే బాలికను బంధించి...అత్యాచారం చేసి హత్య చేశారని క్రైంబ్రాంచ్ పోలీసులు చార్జిషీటులో పేర్కొనడాన్ని తాను నమ్మనని .. బాలికను బంధించిన జనవరి 13 లోహ్రీ పండుగ, 14న మకరసంక్రాంతి పండుగల సందర్భంగా ఆమె ఆ వారంరోజుల పాటు ఉదయం, సాయంత్రం దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసినని అన్నారు. వైష్ణోదేవి మాత దేవాలయానికి ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం కనీసం పన్నెండు మంది భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారని, హంతకులు బాలికను ఆలయంలో దాచడానికి మూర్ఖులు కాదని కథువా గ్రామస్థుడు అంజనాశర్మ అన్నారు. వైష్ణోమాత సన్నిధిలో ఇలాంటి నేరం చేయడానికి ఎవరూ ధైర్యం చేయరని అంజనా శర్మ వాదిస్తున్నారు. మొత్తం మీద కథువా బాలికపై సామూహిక అత్యచారం గుడిలో జరగలేదని.. జరిగే ఆస్కారమే లేదని స్థానికులు ఖరాఖండిగా చెప్తున్నారు.