ట్రంప్ పై విమర్శలు గుప్పించిన ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌

SMTV Desk 2018-04-16 14:00:06  donald trump, fbi former director, america, white house

వాషింగ్టన్‌, ఏప్రిల్ 16 : ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమే అమెరికా అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు. ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమే మాట్లాడుతూ.. ఆరోగ్యపరంగా ఆయన అధ్యక్ష పదవికి అనర్హులు అని తాను అనుకోవడం లేదని, కాకపోతే ఆయన నైతికంగా మాత్రం అనర్హుడు అని పేర్కొన్నారు. అంతేకాకుండా ట్రంప్‌ మానసిక స్థితి సరిగాలేదని ఆయన ఆరోపించారు. జేమ్స్‌ కోమేను ట్రంప్‌ 2017 మేలో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించారు. ఎన్నికల సమయంలో హిల్లరీ క్లింటన్‌ ( డెమోక్రాటిక్ పార్టీ ) పై, ట్రంప్‌ ప్రచార కార్యక్రమంలో రష్యా కుట్ర అంశాలపై విచారణ సమయంలో ఎఫ్‌బీఐ సరిగా పనిచేయలేదని కోమెను పదవి నుంచి తొలిగించారు. అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల సమయం ఉందనగా క్లింటన్‌‌ వ్యక్తిగత ఈమెయిల్‌ సర్వర్‌ అంశంపై జేమ్స్‌ కోమె తిరిగి కేసును తెరిచారు. క్లింటన్‌ ఓటమికి ఇది కూడా ఓక రకంగా ప్రధానకారణమైంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్‌ను ‘మాఫియా డాన్‌’లాగా నడుపుతున్నారు అని జేమ్స్‌కోమె రాసిన పుస్తకంలో ఉన్నట్లు ఇటీవల మీడియాలో కథనాలు వెల్లువడ్డాయి. ఆయన పుస్తకంలో పలు కీలక అంశాలు లీకైనట్లు సమాచారం. అయితే కోమే వ్యాఖ్యాలకు ఘాటుగా స్పందించిన ట్రంప్ ఆదివారం వరుస ట్వీట్లలో కోమెపై విమర్శలును ఖండించారు. క్లింటన్‌ ఈమెయిల్‌ కేసులో కోమె దర్యాప్తు ఏమాత్రం సరిగ్గా చేయలేదని ఆయన అన్నారు.