యూఎస్ లో భారీ స్క్రీన్లపై "భరత్ అనే నేను"..

SMTV Desk 2018-04-15 19:25:32  BHARATH ANE NENU, KORATALA SHIVA, US PREMIER SHOWS.

హైదరాబాద్, ఏప్రిల్ 15 : ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం "భరత్ అనే నేను". డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమాను విదేశాల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్ లో మొత్తంగా 320కిపైగా లోకేషన్లు.. 2000లకుపైగా స్క్రీన్లలో చిత్ర ప్రీమియర్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. తొలి వారాంతానికి మొత్తం 10 వేల షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల విడుదలైన "భరత్ అనే నేను" చిత్ర ఆడియోకు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా ఈ పాటలు విన్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.