రాధికా ఆప్టేను వరించిన బంపర్ ఆఫర్..!

SMTV Desk 2018-04-15 17:36:01  radhika apte, hollywood entry, hollywood director lydia dean.

ముంబై, ఏప్రిల్ 15 : సంచలన కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టేకు బంపర్ ఆఫర్ వరి౦చింది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాత లిడియా డీన్.. దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సినిమాలో రాధికాకు అవకాశం లభించింది. హాలీవుడ్ కు ఇదివరకే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాధికా.. సారా మేగాన్, స్టానా కాటిక్‌ వంటి హాలీవుడ్ తారలు నటిస్తున్న సినిమాలో.. బ్రిటీష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనుంది. మరి హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఈ భామకు అదృష్టం వరి౦చి అక్కడ నిలదొక్కుకుంటుందో.? లేదో.? చూడాలి.