దోషుల్ని వదిలే ప్రశ్నే లేదు : ప్రధాని

SMTV Desk 2018-04-14 11:28:45  narendra modi, Unnao rape case, new delhi, prime minister modi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : యావత్ భారతదేశంను విషాదంలో నింపిన కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనపై ప్రధాని మోదీ ఎట్టకేలకు స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన ఎవ్వరిని వదిలే ప్రశ్నే లేదని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో అంబేద్కర్‌ స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇలాంటి ఘటనలు సమాజానికి సిగ్గుచేటని, బాధితులకు న్యాయం దక్కేలా చూస్తానని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో అంబేద్కర్‌ స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ.." ఈ ఘటనలు (ఉన్నావ్‌, కఠువా అత్యాచార ఘటనలు) దేశాన్ని ద్రిగ్బ్రాంతికి గురిచేశాయి. ఒక నాగరిక సమాజంలో జరగాల్సినవి కావవి. మన సమాజం, దేశం సిగ్గుపడాలి. దేశానికి నేను హామీ ఇస్తున్నాను. (అత్యాచారానికి గురైన) మన కుమార్తెలకు న్యాయం చేస్తాం. దోషుల్ని వదిలే ప్రశ్నే లేదు. పూర్తి న్యాయం జరుగుతుంది" అని వ్యాఖ్యానించారు.