తన రెండవ మనవడితో బాలయ్య..

SMTV Desk 2018-04-13 19:12:12  balakrishna, second grand son, balayya second daughter,

హైదరాబాద్, ఏప్రిల్ 13 : నంద‌మూరి బాల‌కృష్ణ ఇటు సినిమాల‌తో.. అటు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా బాలయ్య మరోసారి తాతయ్య అయిన విషయం తెలిసిందే. బాల‌య్య రెండో కుమ‌ర్తె తేజ‌స్వి ఇటీవ‌లే ఓ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. తన మనవడిని చూసేందుకు బాలయ్య తన కూతురి ఇంటికి వెళ్ళారు. అక్కడ తన కూతురు తేజ‌స్వి, అల్లుడు భ‌ర‌త్ దంప‌తుల‌కు అభినంద‌న‌లు తెలుపుతున్న క్రమంలో తీసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలో బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణికి సైతం మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ ఫోటోలు బయటకు వచ్చాయి కాని తేజస్వి కుమారుడి ఫోటోలు ఇంతవరకు బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.