"రంగస్థలం" మొక్కు తీర్చుకున్న ఉపాసన

SMTV Desk 2018-04-13 16:02:55  UPASANA KAMINENI, UPASANA IN TIRUMALA, RANGASTHALAM MOVIE SUCCESS.

హైదరాబాద్, ఏప్రిల్ 13 : రామ్‌చ‌ర‌ణ్ కథానాయకుడిగా నటించిన "రంగ‌స్థ‌లం" చిత్రం ఘన విజ‌యం సాధించ‌డంతో మెగా ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయారు. ముఖ్యంగా రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌నకు ఈ విజ‌యం ఎంతో సంతోషం క‌లిగించింది. ఇంతటి ఘనవిజ‌యం ద‌క్క‌డంతో ఉపాసన తిరుమల వెంకటేశునికి మొక్కు తీర్చుకుంటోంది. ఏడు కొండలు ఎక్కి మరీ వెంకటేశుని దర్శనానికి వెళ్లింది. ఈ విషయాన్ని స్వయంగా తనే ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తిరుమల మెట్లను ఓ ఫోటో తీసి పోస్ట్ చేసిన ఉపాసన.. రామ్ చరణ్.. రంగస్థలం అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది. ఇక రామ్‌చ‌ర‌ణ్ రంగస్థలం సినిమా సక్సెస్స్ ను ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నేటి సాయంత్రం హైదరాబాద్ లోని యూసుఫ్ గుడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోతోంది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రానున్నాడు.