అమెజాన్‌ను మోసం చేసిన ముఠా అరెస్ట్

SMTV Desk 2018-04-13 14:57:06   Six People Arrested For Cheating Amazon

హైదరాబాద్, ఏప్రిల్ 13: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమేజాన్‌ను మోసగించిన ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి. ఆరుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి అమెజాన్ సంస్థలో సెల్‌ఫోన్లను బుక్ చేసేవారు. అనంతరం ఫోన్లు డెలివరీ కాలేదంటూ ఒక్కో ఆర్డర్‌పై రెండు వస్తువులను దక్కించుకునేవారు. ఇలా 800 ఫోన్లను బుక్ చేసి అదనంగా మరో 800 ఫోన్లను దక్కించుకుని వీటిని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మేవారు. ఇలా జరుగుతున్న వ్యవహరంపై సంస్థ ప్రతినిధులు ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఈ ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించగా వారు చేస్తున్న మోసం బయటపడింది. ఈసందర్బంగా వారి నుంచి రూ. 10.75లక్షల నగదు, 556 సిమ్ కార్డులు, 42 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.