మీరెప్పటికీ మా గుండెల్లో ఉంటారు : రైనా

SMTV Desk 2018-04-12 20:13:06  chennao super kings, suresh raina tweet, csk, ipl

చెన్నై, ఏప్రిల్ 12: సొంతగడ్డపై ఏ జట్టు అయిన బలమైనదే.. ఎందుకంటే అక్కడి అభిమానులు మద్దతు చప్పట్లు, కేరింతల మధ్య వారి ఉత్సాహమే సగం బలం.. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆ అదృష్టం ఈ సారి లేదు. ఎందుకంటే కావేరి నది జలాల వివాదాల కారణంగా చెన్నైలో జరగాల్సిన మ్యాచ్ లను పుణెకు తరలించిన విషయం తెలిసిందే. దీంతో సొంతగడ్డపై ఇకపై ఐపీఎల్‌ మ్యాచ్‌లు లేకపోవడంతో అటు అభిమానులతోపాటు, ఆటగాళ్లు కూడా ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో కొందరు చెన్నై ఆటగాళ్లు ట్విటర్‌ ద్వారా తమ మనసులో మాటను వెల్లడించారు. * ఈ సీజనులో సొంతగడ్డపై ఆడకుండా సీఎస్‌కే అభిమానులను ఉత్సాహపరచకపోవచ్చు. కానీ, మీరెప్పటికీ మా గుండెల్లో ఉంటారు. - సురేశ్‌రైనా * చెన్నైలో ఆడలేకపోవటం బాధాకరమైన విషయం. త్వరలోనే తమిళనాడులో పరిస్థితులు సద్దుమణగాలి. - షేన్‌ వాట్సన్‌ * చెన్నెను వదిలివెళ్లడం కచ్చితంగా బాధించే విషయమే. వచ్చే సంవత్సరమైనా తిరిగి సొంతగడ్డపై ఆడతామని ఆశిస్తున్నాను. ఎప్పటికీ మాకు మద్దతు తెలుపుతూనే ఉండండి. - ఇమ్రాన్‌ తాహీర్‌ * ఈ రోజు చెన్నై నుంచి వెళ్లడం బాధాకరంగా ఉంది. త్వరలోనే చెన్నైలో సమస్యలు పరిష్కారమై, శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని అనుకుంటున్నాను. - స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌