చెల్లెల విషయంలో ఆగ్రహానికి గురైన అర్జున్ కపూర్.

SMTV Desk 2018-04-12 18:27:31  arjun kapoor, jhanvi kapoor, boney kapoor, bollywood website.

ముంబై, ఏప్రిల్ 12 : అలనాటి అందాల తార.. శ్రీరెడ్డి హఠాన్మరణం సినీ పరిశ్రమను ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టింది. ఆమె మరణ౦తో ఒంటరి వారైన తన పిల్లలను బోనీ కపూర్ తన మొదటి భార్య పిల్లలకు దగ్గర చేశారు. ఈ మధ్య కాలంలో తరచూ జాన్వీ, ఖుషిలు తన అన్న అర్జున్ కపూర్ ఇంటి వెళ్తున్నారు. అలా అర్జున్ ఇంటి నుండి జాన్వీ, ఖుషిలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఓ ఫోటోగ్రాఫర్ వారి ఫోటోలను తీశారు. ఆ ఫొటోలు అసభ్యంగా ఉన్నాయని ఓ బాలీవుడ్‌ మీడియా వెబ్‌సైట్‌ వార్తలు రాసింది. ఈ వార్త అర్జున్‌ కంట పడటంతో.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. "ఇలాంటి వెబ్‌సైట్‌ను నిషేధించాలి. మీ కళ్లు ఇలాంటి విషయాలపైనే దృష్టి పెడుతున్నందుకు సిగ్గుపడండి. మన దేశంలో అమ్మాయిలను ఈ విధంగా చూస్తున్నామని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. సిగ్గుగా ఉంది" అని ట్వీట్‌ చేశారు. గతంలో ఇదే మాదిరి జాన్వి, ఖుషిల గురించి సోషల్‌ మీడియాలో తప్పుగా కామెంట్లు చేస్తుండడంతో అర్జున్ సోదరి అన్షులా కపూర్‌ మద్దతుగా నిలిచారు. తన్న చెల్లెల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన విషయం తెలిసిందే.