మమతా బెనర్జీకు భారీ షాక్..

SMTV Desk 2018-04-12 17:49:17  mamata benarjee, tmc party head, west bengal court, west bengal panchayati elections

కోల్‌కతా, ఏప్రిల్ 12 : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం కు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఈ నెల 16 వరకు సస్పెండ్ చేస్తూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ బెంగాల్ శాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా నోటీసు జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియలో ప్రతిపక్షాలు చేసే ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ ఓ నివేదికను ఈ నెల 16న సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటీఎంసీ పార్టీ హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని, ఆ పార్టీ నియంతృత్వ ధోరణీతో వ్యవహరిస్తోందని బీజేపీ తన పిటిషన్‌లో ఆరోపించింది. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా టీఎంసీ అడ్డుకుంటూదని కూడా తెలిపింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు 1978 నుంచి జరుగుతున్నాయి. ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ సస్పెండ్ కావడం ఇదే మొదటిసారి. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు వచ్చే నెల 1, 3, 5 తేదీల్లోనూ, ఓట్ల లెక్కింపు వచ్చే నెల 8న జరగవలసి ఉంది.