తమన్నాకు "దాదా సాహెబ్" అవార్డు..

SMTV Desk 2018-04-12 17:27:52  Dadasaheb Phalke Excellence Award, Tamannaah Bhatia to be honoured, for tamanna role in Baahubali

హైదరాబాద్, ఏప్రిల్ 12 : నటనలో ఉత్తమ ప్రదర్శనను కనబరచిన సినీ ప్రముఖులకు "దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు" ను బహుకరించనున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ అవార్డు కోసం బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, రణ్‌వీర్‌ సింగ్‌లు ఎంపికయ్యారు. తాజాగా ఈ అవార్డుల లిస్టులో మరో ప్రముఖ నటి పేరును చేర్చారు. ఆ అవకాశ౦ టాలీవుడ్ నటి తమన్నాను వరించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "బాహుబలి" లో అవంతిక పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది తమన్నా. అయితే వీరు ఈ అవార్డును ఈ నెల 21 వ తేదీన ముంబైలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. "తనకు దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు" రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. దీనిని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించింది.