ఉద్విగ్నంగా తమన్నా ట్వీట్..

SMTV Desk 2018-04-12 16:02:43  Tamannaah sensational post, Tamannaah twitter,

హైదరాబాద్, ఏప్రిల్ 12 : అమ్మాయిలపై రోజుకో అత్యాచారం జరుగుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజుల్లో అమ్మాయిలకు రక్షణ కరువైంది. ఎన్ని చట్టాలొచ్చినా పరిస్థితి మాత్రం మారడం లేదు. ఈ విషయంపై కథానాయిక తమన్నా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. రోజుకో ప్రదేశంలో బాలికలపై అత్యాచారం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో 8ఏళ్ల చిన్నారి, 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారాన్ని గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేసింది. "జమ్మూకశ్మీర్ లో ఎనిమిదేళ్ల అమ్మాయి.. మరో చోట 16 ఏళ్ల అమ్మాయి అత్యాచారానికి గురయ్యారు. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ తండ్రి పోరాటం చేస్తుంటే రేపిస్ట్‌ని కాపాడటం కోసం, ఆ తండ్రిని చచ్చేంత వరకూ కొట్టారు. అసలు ఈ దేశం ఎటు పోతోంది? చట్ట సవరణలు చేసే వరకూ ఎంతమంది నిర్భయాలు తమ ప్రాణాలను త్యాగం చేయాలి. ఒక దేశం మహిళలను సురక్షితంగా బతకనీయకుంటే.. కచ్ఛితంగా ఆ దేశానికి చికిత్స అవసరం" అంటూ ట్వీట్ చేసింది