ఇంటర్ ఫలితాల్లో.. కృష్ణా ఫస్ట్‌, కడప లాస్ట్‌

SMTV Desk 2018-04-12 15:59:10   AP Intermediate results, ganta srinivasa rao

అమరావతి, ఏప్రిల్ 12 : ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. రాజమహేంద్రవరం షల్టన్‌ హోటల్‌లో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సారనికి సంబంధించి జనరల్‌, వొకేషనల్‌ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు. మొత్తం 73.33 శాతం మంది ఉత్తీర్ణులు అయినట్లు మంత్రి ప్రకటించారు. 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. నెల్లూరు 77 శాతంతో రెండో స్థానంలో ఉండగా, గుంటూరు జిల్లా 76 శాతంతో మూడో స్థానంలో నిలువగా 56 శాతంతో కడప జిల్లా ఆఖరు స్థానంలో నిలిచింది. మొత్తం 4,84, 889 మంది విద్యార్థులు పరీక్షలకు హజరయ్యారు. ఇందులో రెగ్యులర్‌ 4,41,359 మంది రాయగా, ప్రవేట్‌గా 48,530 మంది రాశారు. ముందుగా ప్రకటించిన విధంగానే ఫలితాలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.