వర్మ జీఎస్టీ మాదిరి.. మరో సినిమా..!

SMTV Desk 2018-04-12 15:30:08  a story movie, varma gst movie, director nimesh, heroine srinika.

హైదరాబాద్, ఏప్రిల్ 12 : ఇటీవల పోర్న్ స్టార్.. మియా మాల్కొవాతో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తెరకెక్కించిన "జీఎస్టీ" సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ రూపంలో వర్మ తీసిన ఈ చిత్రం.. ఎన్నో వివాదాలను, విమర్శలను ఎదుర్కొంది. తాజాగా అదే తరహాలో తమిళంలోనూ ఒక వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు నిమేష్ "ఏ స్టోరీ" పేరుతో ఒక వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కథానాయికగా శ్రీనిక నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.పాల్‌మురుగన్‌ కెమెరామెన్‌గా వ్యవహరిస్తు౦డగా.. హరి శంకర్ సంగీతం అందించారు. కథ ఏంటన్నది మాత్రం తెలియలేదు. పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.