జపాన్ లోనూ "బాహుబలి" హవా..

SMTV Desk 2018-04-12 11:57:27  BAHUBALI, JAPAN, BAHUBALI RECORDS IN JAPAN .

హైదరాబాద్, ఏప్రిల్ 12 : దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన "బాహుబలి: ది కన్‌క్లూజన్‌" చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు తెచ్చుకొని అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా విదేశాల్లో సైతం ఘన విజయం సాధించింది. అయితే ఈ చిత్రాన్ని జపాన్ లో డిసెంబరు 29న విడుదల చేశారు. అక్కడ మంచి వసూళ్లను రాబట్టి విజయం సాధించింది. ఇప్పటికి 100 రోజులు పూర్తి చేసుకొని అక్కడి బాక్సాఫీసు వద్ద 1.3 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత శోభూ యార్లగడ్డ తన ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఇంతటి ప్రేమ, ఆదరణ చూపిన ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే "బాహుబలి"ని చైనాలో కూడా విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది.