మహిళా కండక్టర్‌పై దాడి

SMTV Desk 2018-04-12 11:03:30  Lady conductor attack, tdp leader,

విజయవాడ, ఏప్రిల్ 12: విధుల్లో ఉన్న మహిళా కండక్టర్‌పై టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం వణుకూరుకు చెందిన రెంటపల్లి ఇందిర విజయవాడ డిపోలో కండక్టర్‌గా పని చేస్తోంది. మంగళవారం రాత్రి రూట్‌ నంబర్‌ 10 బస్సును పెనమలూరు హైస్కూల్‌ సెంటర్‌ వద్ద వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్‌కు సూచనలు చేస్తున్నారు. టీ స్టాల్‌ వద్ద గ్రామానికి చెందిన కిలారు ఆంజనేయులు బస్సు నడిపే విధానం ఇదేనా అంటూ వెళ్లి కండక్టర్‌పై దురుసుగా ప్రవర్తించి, దాడి చేసి గాయపర్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.