రాజమౌళి నాలో స్ఫూర్తి నింపేవారు : సుకుమార్

SMTV Desk 2018-04-11 16:29:58  director sukumaar, rangasthalam, rajamouli.

హైదరాబాద్, ఏప్రిల్ 11 : 1985 వ సంవత్సరపు కథతో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన "రంగస్థలం" చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పూర్తిగా భావోద్వేగాలతో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాను అభినందిస్తూ చాలా మంది సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు. అంతేకాకుండా సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ విషయంపై ఓ ఇంట‌ర్వ్యూలో సుకుమార్ స్పందిస్తూ.. "రాజ‌మౌళికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. "రాజ‌మౌళి నాలో ఎంతో స్ఫూర్తి నింపారు. నువ్వు క‌చ్చితంగా సాధిస్తావని ఎప్పుడూ నాలో స్ఫూర్తి నింపేవారు. ప్ర‌పంచం ఎలా ఉన్నా రాజ‌మౌళి మాత్రం ఎప్పుడూ నా వైపే ఉన్నారు. నేను ప‌రాజ‌యాల్లో ఉనప్పుడు కూడా ఆయ‌న నా వెంటే ఉన్నారు" అని తెలిపారు.