షియామి ప్రతినిధులతో చంద్రబాబు సమావేశ౦

SMTV Desk 2018-04-11 11:45:59  ap cm chandrababu naidu, Meeting, Shiyami Company, thirupathi

తిరుపతి, ఏప్రిల్ 11: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు షియామి సంస్థ ప్రతినిధులతో తిరుపతిలో సమావేశ౦ నిర్వహించారు. శ్రీసిటీ, తిరుపతి ఈఎంసీ-2 ప్రాంతాల్లో షియామి పరిశ్రమ ఏర్పాటుపై సీఎం చర్చించారు. మంత్రులు లోకేశ్‌, అమర్‌నాథ్‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం వారికి వివరించారు. మంత్రి లోకేశ్‌‌ మంగళవారమే తిరుపతికి వచ్చి సంస్థ ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రయోజనాలను సంస్థ ప్రతినిధులకు వివరించారు.