శ్రీరెడ్డి ఎంచుకున్న విధానం తప్పు.. : కంగనా

SMTV Desk 2018-04-11 11:11:59  kangana ranaut, kangana comments on srireddy, casting couch.

ముంబై, ఏప్రిల్ 11 : టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న వర్తమాన నటి శ్రీరెడ్డికి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మద్దతుగా నిలిచింది. కాని శ్రీరెడ్డి పోరాడే విధానమే తప్పు అని తనకు కొన్ని సలహాలిచ్చింది. ఇటీవల శ్రీరెడ్డి అర్దనగ్న ప్రదర్శనతో మరోసారి దేశవ్యాప్తంగా చర్చించుకునే అంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కంగనా స్పందిస్తూ.. టాలీవుడ్‌లోనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితులున్నారని, సినీ ఇండస్ట్రీలలో చాలామంది అమ్మాయిలు అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. తాను కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొంది. కాని ఇలాంటి విషయాలపై పోరాడటానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్పిన కంగనా.. శ్రీరెడ్డి ఎంచుకున్న మార్గం మాత్రం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ, పోరాడుతున్న సమస్యకు ప్రచారం జరిగేలా జాగ్రత్త పడాలని శ్రీరెడ్డికి కంగనా సూచనలిచ్చింది. ఈ తరహాలో నిరసనలు వ్యక్తం చేస్తే అసలు సమస్య పక్కదారి పట్టే అవకాశం ఉందని, సరైన మార్గం ఎంచుకోవాల౦ది. అలాగే కాస్టింగ్ కౌచ్ పై ఆమె జరుపుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని, గతంలో అన్యాయానికి గురైన మహిళలంతా ముందుకు రావాలని కంగన పిలుపునిచ్చింది.