మీ ప్రేమ మరింత బలోపేతం కావాలి : రాహుల్

SMTV Desk 2018-04-10 17:12:09  rahul gandhi, rahul comments on ias marriage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 : 2015లో ఐఏఎస్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన దళిత వర్గానికి చెందిన టీనా దబీ అనే 24 ఏళ్ల యువతి ప్రేమ వివాహంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. టీనా దబీ.. ఐఏఎస్ లో రెండో ర్యాంక్ సాధించిన కశ్మీర్‌కు చెందిన అథర్ ఆమిర్‌ ఉల్ షఫీ (25) అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో వారిరువురికి శుభాకాంక్షలు తెలిపారు. టీనా దబీ, అథర్ ఆమిర్‌ ఉల్ షఫీ ల ప్రేమబంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నా. అసహనం, విద్వేషం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నానని, గాడ్‌ బ్లెస్‌ యూ అని రాహుల్‌ పేర్కొన్నారు.