రకుల్ దుమ్ము దులిపిన శ్రీరెడ్డి..

SMTV Desk 2018-04-10 15:30:53  srireddy fires on rakul preeth, srireddy facebook page,

హైదరాబాద్, ఏప్రిల్ 10 : రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి ఘాటుగా స్పందించారు. రకుల్ ప్రీత్ పై ఘాటుగా విమర్శలు చేస్తూ తన ఫేస్ బుక్ పేజిలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "ఒక రెక్క పీత గురించి మాట్లాడుదామని వచ్చా. కోట్ల రూపాయలు పెట్టే వారికి అర్హత ఉంటుందని.. టాలెంటెడ్ వాళ్లని ప్రోత్సహిస్తారని కబుర్లు చెప్తోంది. ఏమే.. నువ్వూ నీ మొఖం. నువ్వు మా ఊళ్లో పిల్లలాడుకునే సైకిల్ టైర్‌లా ఉంటావే. ఒక ఆడదానివని వదిలేస్తున్నాను. అసలు నీకెందుకే మా తెలుగోళ్ల గురించి, మా ఉద్యమాల గురించి. ఇక్కడకొచ్చి ఏలేద్దామని ఎందుకు ట్రై చేస్తున్నావ్ నువ్వు. నీకు టాలెంట్ ఉందా.. నీకు లిప్ మూమెంట్ వచ్చా అసలు. నీ మొఖానికి లంగాఓణీ వేసుకుంటే ఎలా ఉంటావో చూసుకున్నావా. మా పోరాటాల గురించి నీకెందుకే. నోరు మూసుకుని కూర్చో ఇంట్లో. లేకపోతే నీ షూటింగ్ స్పాట్‌కొచ్చి మరీ కొడతాం" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.