పెళ్ళైతే ఏంటి..? అలాంటి ధోరణి మారాలి.!

SMTV Desk 2018-04-10 14:40:13  samantha about marriage, rangasthalam movie, samantha interview.

హైదరాబాద్, ఏప్రిల్ 10 : పెళ్ళైతే సినిమా అవకాశాలు రావు అనే ధోరణి మారాలి అని ప్రముఖ కథానాయిక సమంత అంటున్నారు. ఇటీవల సమంత కథానాయికగా నటించిన "రంగస్థలం" చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. రామలక్ష్మిగా సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే సమంత ఓ ఇంటర్వ్యూలో పెళ్లి అయిపోయిన హీరోయిన్స్ కి కూడా అవకాశాలను ఇవ్వాలనే విషయంపై స్పందించింది. సమంత మాట్లాడుతూ.. మొన్నటి వరకు సక్సెస్ లో ఉన్న హీరోయిన్ కి పెళ్లి జరిగితే ఆమె చేసిన సినిమాలు ఇక ప్రేక్షకులు చూడరు అని ఫిల్మ్ మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. అది వారి ఆలోచన మాత్రమే కానీ ప్రేక్షకులు మాత్రం అలా కాదు. సమంత పెళ్లి అయ్యింది కదా అని నా సినిమాలు చూడమని చెప్పలేదు. నా క్యారెక్టర్ ను అందరు యాక్సెప్ట్ చేశార౦టూ తన స్టైల్ లో వివరించింది. ఇక తనకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తోంది మాత్రం రెండు కుటుంబాలని.. అక్కినేని - దగ్గుబాటి ఫ్యామిలీల సపోర్ట్ వల్లే 200% వర్క్ మీద ఫ్రీ మైండ్ తో వెళుతున్నా అంటూ చెప్పుకొచ్చింది.