అభిమానులకు సల్మాన్ కృతజ్ఞత

SMTV Desk 2018-04-09 18:59:00  Salman Khan, Salman Emotional Greeting To His Fans.

ముంబై, ఏప్రిల్ 9 : బాలీవుడ్ ఖండాల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. సల్లూ బాయ్ కి జోధ్‌పూర్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. సల్మాన్ అభిమానులు సినీ ప్రముఖులందరు.. ఆయనకి మద్దతు తెలిపారు. శిక్ష పడిన వెంటనే ఆయన తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశాడు. జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో రెండు రోజులు ఉన్న సల్మాన్‌ కి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయనకు విముక్తి లభించింది. అయితే తనపై అభిమానులు చూపించిన ఆదరాభిమానాలకి కృతజ్ఞతతో కన్నీరు పెట్టుకుంటున్నానని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.