‘సీబీఎస్‌ఈ’ లీక్ కేసులో ముగ్గురి అరెస్టు

SMTV Desk 2018-04-08 15:28:07  CBSE Paper Leak, Economics papers, Delhi police arrested by the accused

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.12వ తరగతి ఆర్థిక శాస్త్రం పరీక్షకు మూడు రోజుల ముందే బయటకోచ్చిందని పోలీసులు వెల్లడించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఉనాలో ప్రశ్నపత్రం లీకైందని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ఉనాలోని డీఏవీ సెంటినరీ పబ్లిక్‌ స్కూల్‌కు చెందినవారు. ఈ ముగ్గురిలో ఒకరు ఆర్థికశాస్త్రం అధ్యాపకుడు కాగా మిగిలిన ఇద్దరు బోధనేతర సిబ్బంది. కంప్యూటర్‌ సైన్స్‌ పరీక్ష రోజైన మార్చి 23నే ఉనాలోని యూనియన్‌ బ్యాంకు స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి నిందితులు ఆర్థిక శాస్త్రం ప్రశ్నపత్రాన్ని బయటకు తీసి 40 వాట్సాప్‌ గ్రూప్‌లకు పంపించారని పోలీసులు గుర్తించారు.