సిగ్గు కాదు.. గర్వపడండి!

SMTV Desk 2018-04-08 13:14:49  SUSMITHA SEN, FITNESS RULES, BODY SHY WORK OUTS.

హైదరాబాద్, ఏప్రిల్ 8 : మాజీ ప్రపంచ సుందరి, నటి సుస్మితా సేన్‌ మహిళలందరికి ఓ సలహా ఇచ్చారు. నిత్యం ఎన్నో పనులతో సతమతమవుతూ.. శారీరక శ్రమను అనుభవిస్తున్నారు. అలాంటి జీవితంలో మీకంటూ కొంత సమయం కేటాయించండి అంటూ పేర్కొన్నారు. ప్రతి రోజు వర్కవుట్స్‌ చేయండి. అలా చేస్తే మనసు తేలికపడుతుంది. కాస్తంత ప్రశాంతత దొరుకుతుందని వెల్లడించారు. మరీ ముఖ్యంగా వర్కవుట్స్‌ చేస్తున్న సమయంలో సెల్ఫీలు తీసుకోమంటున్నారు. ఆమె వర్కవుట్స్‌ చేసిన తర్వాత బికినీలో దిగిన ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. "బాడీ షై? (శరీరాన్ని చూపించడానికి సిగ్గు పడుతున్నారా?) వద్దు! బాడీ ప్రౌడ్‌ (శరీరాన్ని చూపించడానికి గర్వపడండి!). మంచిగా కనిపించడం ఒక విషయం అయితే.. మంచిగా ఫీలవడం సర్వస్వం" అని తెలిపారు. 42 ఏళ్ళ వయసులోనూ చాలా ఫిట్‌గా ఉన్న సుస్మితా సేన్‌, చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.