ఈ నెల 12న పీఎస్‌ఎల్వీ సీ41 ప్రయోగం!

SMTV Desk 2018-04-08 12:52:17  ISRO, pslv,srihari kota

శ్రీహరికోట, ఏప్రిల్ 8 : ఈ నెల 12న తెల్లవారు జామున 4.04 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ41 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు శనివారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఇస్రో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ – షార్‌ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి . ఈ ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ సిరీస్‌లో ఎనిమిదో ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టనుంది. తొలుత నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ సిరీస్‌లో 7 ఉపగ్రహాలను విజయవంతంగా రోదసీలోకి పంపారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 43వ రాకెట్, ఎక్సెల్‌ స్ట్రాపాన్‌ బూస్టర్లతో 20వ ప్రయోగం కావడం విశేషం. రాకెట్‌కు నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తిచేసి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నారు.