అల్ ది బెస్ట్ రూపా

SMTV Desk 2017-07-02 14:02:43  neet results, rajasthan, rupa, rank, 10th class, inter, top ranker

రాజస్థాన్, జూలై 2 : సంకల్ప బలంకు ప్రోత్సహం తోడైతే సాధించందంటు ఏమి లేదు. దానికి నిదర్శనం ఈ మహిళలే. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన రూపా ....చిన్నతనంలోనే పెండ్లి అయ్యి కుటుంబ బాధ్యతలు చేపట్టిన ఆ బాలిక విపరీతమైన పోటీ ఉండే నీట్ పరీక్షలో ఉతీర్ణత సాధించారు. జైపూర్ లోని కరేరీ గ్రామంలో ఓ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన రూపా యాదవ్(21)కి ఎనిమిదేండ్ల వయస్సుకే పెండ్లి జరిగింది. పెండ్లి తరువాత చదువు మీద రూపాకి ఉన్న ఆసక్తి గ్రహించిన ఆమె భర్త ప్రోత్సహించడంతో పాటు ఆమె బావ ప్రోత్సహం కూడా ఉన్నది. దీంతో ఆమె చదువు కొనసాగిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించారు. ఇదే ఊపులో గతేడాది నీట్ పరీక్ష రాశారు. కానీ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. కసితో మరింత ఎక్కువగా కష్టపడి ఈ ఏడాది నీట్ పరీక్షలో 2,612 ర్యాంకు సాధించారు. ఈ మేరకు రూపా మాట్లాడుతూ ఇంత దూరం రావడానికి తన భర్త ఇచ్చిన ధైర్యం, ప్రోత్సహంతోనే ఈ విజయం సాధించగలిగానని తెలిపారు. ఈ విజయం తన భర్త, బావ కృషి ఫలితమేనని రూపా వెల్లడించారు. నీట్ పోటీ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన రూపా...