హైదరాబాద్, ఏప్రిల్ 8 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. వక్కతం వంశీ దర్శకత్వంలో వస్తున్న "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా" చిత్రంలో నటిస్తున్నారు. నేడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి డైలాగ్ ఇంపాక్ట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ డైలాగ్ ఇంపాక్ట్ లో.. "సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మనకు.. ఒక్కటే ఇండియా" అంటూ అల్లు అర్జున్ చెప్తున్న డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో బన్ని ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. బన్నికి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.