ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ!

SMTV Desk 2018-04-07 16:41:45  Balka Suman, Robbery, mancherial,trs mp

మంచిర్యాల, ఏప్రిల్ 7 : మంచిర్యాల పట్టణంలో గౌతమ్‌నగర్‌లోని పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ జరిగింది. ఎంపీ ఇంటితో పాటు మరో రెండు ఇళ్లల్లో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగినట్లు సమాచారం. ఎంపీ ఇంట్లో రూ. లక్ష నగదును దొంగలు అపహరించినట్లు తెలుస్తోంది. బాల్క సుమన్‌ సహా మిగతా ఇంటి యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఎంత మొత్తంలో చోరీ జరిగిందో తెలియడం లేదు. చోరీ ఘటనను పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వరుస దొంగతనాలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.