రామ్ చరణ్ తో కనెక్ట్ కాలేకపోతున్నా..

SMTV Desk 2018-04-07 16:35:56  director sukumaar, ram charan, sukumaar love effection on ram charan.

హైదరాబాద్, ఏప్రిల్ 7 : సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన "రంగస్థలం" చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. చిట్టిబాబుగా రామ్ చరణ్ కు, రామలక్ష్మిగా సమంతకు మంచి మార్కులే పడ్డాయి. వారి నటనకు సినీ అభిమానుల నుండి ప్రముఖుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా గురించి దర్శకుడు సుకుమార్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. చరణ్‌తో తాను కనెక్ట్ అవలేకపోతున్నానని తెలిపారు. దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారు. చెర్రీతో తన లవ్ చరణ్ కు ప్లస్ అయిన తన గడ్డమట. ప్రస్తుతం చరణ్ గడ్డం తీసేయడంతో.. "ఇన్నాళ్లూ ఈ మనిషితోనేనా నేను మాట్లాడింది.. ఈ మనిషినా నేను షూట్ చేసింది. ఈ మనిషితోనేనా.. ఇంత ప్రేమ పంచుకుంది అనేది ఫీల్ అవలేకపోతున్నా. హాయ్ సుక్కు అన్నా సరే.. ఆ చరణ్ అంటున్నా.. కానీ ఇప్పటికీ నేను చిట్టిబాబుగా ఫీల్ అవలేకపోతున్నా" అంటూ సుకుమార్ వెల్లడించారు.