జియో వల్ల వినియోగదారులకు ఆదా

SMTV Desk 2018-04-06 17:42:23  Reliance jeo, telecom, customers, 64 crores,

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: 2016 సెప్టెంబరులో మార్కెట్లోకి అడుగుపెట్టిన జియో టెలికాం రంగంలో ఓ సంచలనం. జియో రాకతో వినియోగదారులకు ఏటా రూ. 64వేల కోట్లు ఆదా అయినట్లు ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌(ఐఎఫ్‌సీ) తన నివేదికలో పేర్కొంది. చౌక ధరల్లో డేటా అఫర్లు అందిస్తూ అనతి కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. జియో దెబ్బతో ఇతర టెలికాం సంస్థలు కూడా డేటా టారిఫ్‌లను తగ్గించి కస్టమర్లకు ఉపశమనం కల్గించాయి ప్రారంభంలో ఉచిత డేటా అందించిన జియో.. ఆ తర్వాత తక్కువ టారిఫ్‌లతో అనేక డేటా ఆఫర్లు తీసుకొచ్చింది. జియోకు ముందు 1జీబీ డేటాకు సగటున రూ. 152 ఉండగా.. ఆ తర్వాత అది రూ. 10కి పడిపోయింది. దీని వల్ల కోట్లాది మంది భారతీయులకు ఇంటర్నెట్‌ సదుపాయం చేరింది. తద్వారా వినియోగదారుల డేటా ఖర్చులు కూడా బాగా తగ్గాయి. జియో ప్రారంభమైన ఆరు నెలల్లోనే భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక మొబైల్‌ డేటా యూజర్లు గల దేశంగా ఎదిగింది. జియోకు పోటీగా ఇప్పటికే అనేక టెలికాం సంస్థలు తమ టారిఫ్‌లను తగ్గిస్తూ వస్తున్నాయి. దీంతో వినియోగదారులకు డేటా ఖర్చుల నుంచి ఉపశమనం కల్గినట్లయింది.