హైకోర్టులో ఈసీ కౌంటర్‌

SMTV Desk 2018-04-06 17:00:28  high court, Election Commission counter, Telangana Government

హైదరాబాద్, ఏప్రిల్ 6: హైకోర్టులో ఎన్నికల సంఘం కౌ౦టర్ దాఖలు చేసింది. తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వం రద్దు కేసుకు సంబంధించి హైకోర్టులో ఎన్నికల సంఘం కౌంటర్ పిటిషన్ వేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం విధి అని.. ఆరు వారాల వరకు నోటిఫికేషన్ ఇవ్వొద్దన్న కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని ఈసీ పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు సీసుకోలేదని, తమపై వ్యాజ్యాన్ని కొట్టివేయాలని ఎన్నికల సంఘం హైకోర్టును కోరింది.