నా పిల్లల్ని అలా వెళ్ళనివ్వను : సన్నీ లియోన్

SMTV Desk 2018-04-06 14:53:24  sunny leone, sunny leone interview, about sunny childrens.

ముంబై, ఏప్రిల్ 6 : సన్నీ లియోన్.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ దూసుకెళ్తోంది. తను సినిమాల్లోకి రాకముందు పోర్న్‌స్టార్‌గా కెరీర్‌ మొదలుపెట్టి బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించే వరకూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. పోర్న్‌స్టార్‌గా అడుగుపెట్టినప్పటి నుండి ఎంతో మంది ఆమె బహిరంగంగానే విమర్శించారు. ఛీ కొట్టారు. తన 21 ఏళ్ళ వయస్సులో ఎంతో ఆటంకాలను, విమర్శలను ఎదుర్కొన్న ఆమె.. తన తల్లిదండ్రులకు ఇష్టం లేని దారిని ఎంచుకొని తనకు ఇష్టం ఉన్న రంగం వైపే వెళ్ళారు. ప్రస్తుతం సన్నీ ముగ్గురు పిల్ల‌ల‌కు త‌ల్లి. గ‌తంలో ఓ పాప‌ను ద‌త్త‌త తీసుకున్న స‌న్నీలియోన్ దంప‌తులు.. ఇటీవ‌ల ఇద్ద‌రు క‌వ‌ల‌ల‌కు స‌రోగ‌సీ ద్వారా జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌న పిల్ల‌ల గురించి ఓ ఇంట‌ర్వ్యూలో స‌న్నీ మాట్లాడింది. "న‌న్ను అస‌హ్యించుకుంటూ ఎన్నో ఉత్తరాలు, ఈ-మెయిల్స్ నాకు వచ్చేవి. ఎంతో నీచంగా మాట్లాడుతూ.. నా మనసుకు పెద్ద గాయాలు చేశారు. ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు. వాళ్ల ఇష్ట ప్రకారమే నడుచుకోవచ్చు. కాని నేను ఏ విమర్శలను ఎదుర్కొన్నానో ఆ దారిలో మాత్రం నా పిల్లల్ని వెళ్ళనివ్వను" అంటూ భావోద్వేగంతో వెల్లడించింది.