బాలీవుడ్ మాజీ ప్రేమజంట ఆటపాట..

SMTV Desk 2018-04-06 10:58:30  bollywood ex lovers, deepika padukone, ranbeer kapoor, event dance viral.

ముంబై, ఏప్రిల్ 6 : బాలీవుడ్ జంట రణ్‌ బీర్‌ కపూర్‌, దీపిక పదుకొనే లు ఒకప్పుడు ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల మనస్పర్థలు ఏర్పడి దూరమయ్యారు. అప్పటి నుండి స్నేహితుల్లా ఉంటున్నారు. అయితే సుదీర్ఘ కాలం తరువాత ఆ మాజీ ప్రేమ జంట కలిసి ఓ ఈవెంట్ లో ఆడిపాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వారి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా ముంబైలో ఏషియన్‌ పెయింట్స్‌ నిర్వహించిన "గెలాక్సీ ఆఫ్ స్టార్స్‌" కార్యక్రమానికి రణ్‌ బీర్‌ కపూర్‌, దీపిక పదుకొనే లు హాజరయ్యారు. ఇద్దరూ కలిసి నటించిన "యే జవానీ హై దివానీ", "తమాషా" సినిమాలతో పాటు "చెన్నై ఎక్స్‌ప్రెస్‌", "యే దిల్‌ హై ముష్కిల్‌" సినిమాల్లోని పాటలకు స్టేజ్‌పై డ్యాన్సులు చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ డాన్స్ వీడియోలను రణ్‌ బీర్ ఫ్యాన్‌ యూనివర్స్ ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేయగా, వారి అభిమానులు షేర్ చేసుకుంటూ వైరల్ చేశారు.