మరో బాంబు పేల్చిన శ్రీరెడ్డి..

SMTV Desk 2018-04-05 16:22:33  actress srireddy, srireddy facebook post.

హైదరాబాద్, ఏప్రిల్ 5 : టాలీవుడ్ నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పేరుతో తనను వేధించిన ఇండస్ట్రీ పెద్దల బండారం బయటపెడుతూ దడ పెట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల, గాయకుడు శ్రీరామచంద్రలు అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేసిన విషయ౦ తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా ద్వారా మరో స్టార్ గురించి ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ఏంటంటే.. రియల్ లైఫ్‌లో చాలా బాగా నటిస్తావు. ఆన్ స్క్రీన్‌లో చాలా నేచురల్‌గా కనిపిస్తావు. కానీ అది నీ మాస్క్ మాత్రమే. లైఫ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఎప్పుడూ చెబుతావు. కానీ అదంతా జనాల సానుభూతి పొందడం కోసమే. నీకంటే తాతలు, తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్న స్టార్స్ ఎంతో నిజాయితీగా, సిన్సియర్ గా ఉంటారు. చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌ వంటి గొప్ప కో స్టార్స్‌ నుంచి నీవు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వారెవరికీ గర్వం లేదు. కానీ నువ్వు చాలా యాటిట్యూడ్ చూపిస్తావంది. నువ్వు చిన్న డైరెక్టర్లు, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న వారిని గౌరవించవు. ఈ మధ్యే నీకు కొడుకు పుట్టాడు. అందుకు అభినందనలు. జీవితంలో జాగ్రత్తగా ఉండు. ఎంతో మంది అమ్మాయిలను నీవు వాడుకున్నావు. వారు ఇప్పటికీ ఏడుస్తున్నారు. దేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు గుర్తుంచుకో. కాకపోతే శిక్షకు కొంచెం సమయం పడుతుంది. నీవు కచ్చితంగా ఇబ్బందుల్లో పడతావ్. సినీ పరిశ్రమ నిన్ను శిక్షిస్తుంది. ఇండస్ట్రీ నుంచి ఇలాంటివి ఈకలా రాలిపోవాలంటూ పోస్ట్ పెట్టింది.