ఫోటోలను బయటపెట్టిన శ్రీరెడ్డి..

SMTV Desk 2018-04-05 16:06:13  actress srireddy, singer srirama chandra, srireddy facebook post.

హైదరాబాద్, ఏప్రిల్ 5 : టాలీవుడ్ నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామచంద్ర తనతో అసభ్యకంగా ప్రవర్తించాడ౦టూ.. అందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. "మన ఇండియన్ ఐడల్ చాట్ చూడండి.. శ్రీరామ్ సిగ్గుపడాలి" అంటూ వాట్సప్ స్క్రీన్ షాట్స్ ను ఈ పోస్ట్ లో జతపరిచింది. గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి.. సినీ ప్రపంచం తెర వెనుక రహస్యాలను బయట పెడుతూ వస్తోంది. గత రెండు రోజుల క్రితం దర్శకుడు శేఖర్ కమ్ములపైనా శ్రీరెడ్డి ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.