సోషల్ మీడియాలో దూసుకుపోతున్న సూపర్ స్టార్..!

SMTV Desk 2018-04-05 15:33:09  mahesh babu, twitter followers, 6millions,

హైదరాబాద్, ఏప్రిల్ 5 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. నిత్యం తన సినిమాలు, కుటుంబానికి సంబంధించిన పోస్టులతో అభిమానులకు అందుబాటులోనే ఉంటారు. తాజాగా మహేష్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. అమాంతం ఆయన ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్ల (60 లక్షలు) కు చేరుకుంది. కాని మహేశ్‌ బాబు మాత్రం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. ఆయనే మహేశ్ బావ గల్లా జయదేవ్‌. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో "భరత్ అనే నేను" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 7వ తేదీన ఎల్బీనగర్ లో నిర్వహించనున్నారు. మరి టాలీవుడ్ హీరోల్లో ఎవరికీ లేనంత మంది ఫాలోవర్లు మహేశ్‌ బాబుకి గొప్ప విషయమే కదా.!