రైలు శుభవార్త .....

SMTV Desk 2017-07-01 18:46:43  Indian Railways July 1, Reservation, Online, Waiting ticket issued, Century, capital, rail Coach, Tatkal ticket

పట్నా, జూలై 1 : భారతీయ రైల్వే జులై 1 నుంచి తన సేవలను మరింత విస్తరించనుంది. పలు నియమ నిబంధనల్లో మార్పులు తీసుకురానుంది. రిజర్వేషన్‌కు సంబంధించిన అంశాల్లో పలు సవరణలు చేసింది. జులై 1 నుంచి ఆన్‌లైన్‌లో వెయిటింగ్ టిక్కెట్ జారీ చేయరు. దీనితోపాటు శతాబ్ధి, రాజధాని తదితర రైళ్లలో కోచ్‌ల సంఖ్య పెరగనుంది. రిజర్వేషన్‌తో కూడిన తత్కాల్ టిక్కెట్‌ను రద్దుచేసుకుంటే సగం మొత్తం రిఫండ్ తిరిగి ఇవ్వనున్నారు. దీనితోపాటు ప్రయాణికులకు వారు కోరిన మీదట స్థానిక భాషతో కూడిన టిక్కెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. శతాబ్ధి, రాజధాని, దురంతో తదితర ఎక్స్‌ప్రెస్‌ల ప్రయాణవేగం పెరగనుంది. వీటిలో ఇకపై కన్ఫర్మ్ టిక్కెట్‌ను మాత్రమే ఇవ్వనున్నారు. టిక్కెట్ రద్దు చేసుకున్న పక్షంలో కోచ్ తరహాను అనుసరించి సగం మొత్తాన్ని చెల్లించనున్నారు. ఏసీ, సెంకెడ్ క్లాస్ టిక్కెట్ రద్దు చేసుకుంటే 100 రూపాయలకు మించి కోత పడనుంది. ఏసీ థర్డ్ కు 90 రూపాయలు, స్లీపర్ క్లాస్ టిక్కెట్‌ను రద్దుచేసుకుంటే 60 రూపాయలకు మించి కోత విధించనున్నారు. కాగా కాగితం రూపంలో టిక్కెట్ ఇవ్వడం మానివేస్తారని వస్తున్నఆరోపణలు అవాస్తవం అని రైల్వేశాఖ అధికారులు స్పష్టం చేసింది.