ఆహా ఎంత చక్కటి సృజనాత్మకత..!

SMTV Desk 2018-04-04 15:35:03  Oru Kuttanadan Blog, rai laxmi, Mammootty clicks an awesome photo.

హైదరాబాద్, ఏప్రిల్ 4 : సూర్యుడినే మింగేసేలా ఉంది కదూ..! ఇంతకి ఈ ఫొటోకు ఫోస్ ఇచ్చిన హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.? రాయ్‌లక్ష్మి. ఫోటో మాత్రం భలే వచ్చింది కదా.! ఇంతకీ ఈ ఫోటో తీసింది ఎవరో తెలుసా.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అగ్ర కథానాయకుడు మమ్ముట్టి. తనలో మంచి కథానాయకుడే కాదండి. మంచి ఫోటో గ్రాఫర్ కూడా ఉన్నాడు. మమ్ముట్టి, రాయ్‌లక్ష్మి జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్ర షూటింగ్ విరామ సమయంలో కెమెరా చేతపట్టి తన సృజనని ఇలా ఆవిష్కరించారు మమ్ముట్టి. ఇంత అందమైన ఫోటోను రాయ్‌లక్ష్మి ఎంచక్కా ట్విట్టర్‌ ద్వారా పంచుకొంది. అలాగే జలపాతాల దగ్గర దిగిన ఫోటోను మాత్రం తను కావాలని ఇష్టపడి తీయించుకు౦ది. తాను నటిస్తున్న సినిమా చిత్రీకరణ అందమైన ప్రదేశంలో చిత్రీకరణ జరుపుకుంటు౦దంటూ ట్విట్టర్‌లో ఫోటోతో సహా పోస్ట్‌ చేసింది.