చెర్రీ మాటే నా మాట..

SMTV Desk 2018-04-04 11:45:46  NTR, RAMCHARAN, RAJAMOULI, MULTI STARRER

హైదరాబాద్, ఏప్రిల్ 4 : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐపీఎల్ తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెట్‌తో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇదే కార్యక్రమంలో మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా త్వరలో రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే మల్టీస్టారర్ చిత్రం గురించి చెప్పాలని మీడియా కోరగా.." రాజమౌళిగారు ఇంత వరకు నాకు ఏ కథ చెప్పలేదు. సినిమా కోసం సిద్ధంగా ఉండమని మాత్రం చెప్పారంతే" అని యంగ్ టైగర్ అన్నారు. ఈ సినిమా వివరాలపై తాజాగా ‘రంగస్థలం’ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ ను ఆడగగా ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే చెప్పారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఇంతవరకు పరాజయం ఎరుగని రాజమౌళి మీద ఉన్న నమ్మకంతోనే ఈ ఇద్దరు సినిమాను అంగీకరించారు. అందుకు తగ్గట్టు జక్కన్న కథను చెక్కే పనిలో పడ్డాడు. ఈ సినిమా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.