ఎస్సీ, ఎస్టీ చట్టంపై స్టే ఇచ్చేది లేదు : సుప్రీం

SMTV Desk 2018-04-03 16:31:17  supreme court,sc st ,act,review petition

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఎస్సీ, ఎస్టీ చట్టానికి తాము వ్యతిరేకం కాదని, అయితే దీని వల్ల అమాయకులకు శిక్షలు పడకూడదని సుప్రీంకోర్టు వెల్లడించింది. తక్షణ అరెస్ట్‌ను నిషేధించడంతో పాటు మధ్యంతర జామీను పొందే అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు మార్చి 20న ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ‘ప్రజల హక్కులను ఎలా కాపాడాలో మాకు బాగా తెలుసు. మా ఉత్తర్వులను రాజకీయం చెయొద్దు. అసలు ఆందోళనలు చేస్తున్న వాళ్లు మా తీర్పును క్షుణ్ణంగా చదివారా?. ఆందోళన వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. ఎలాంటి విచారణ లేకుండా అరెస్టులు చేయాలని ప్రభుత్వం ఎందుకనుకుంటుంది?. ఎస్టీ, ఎస్టీ చట్టానికి మేం వ్యతిరేకం కాదు. అదే సమయంలో అమాయకులకు శిక్ష పడరాదు’ అని బెంచ్‌ వ్యాఖ్యానించింది. కాగా, స్టేకు నిరాకరించిన కోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను పది రోజులు వాయిదా వేసింది.