జీఎస్టీ అంటే నాకు తెలుసు.. కానీ!

SMTV Desk 2017-07-01 15:59:14  JST of the UP, UP CM Adityanath, Lucknow,Social Welfare Minister Ramapatyas, Media

లక్నో, జూలై 1 : జీఎస్టీపై సందేహాలు తీర్చేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆదేశాల మేరకు ఉత్తర ప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ తో మంత్రులందరు కదిలారు. శుక్రవారం లక్నోలో జరిగిన కార్యక్రమంలో సాంఘీక సంక్షేమశాఖమంత్రి రమాపతిశాస్త్రీని మీడియా జీఎస్టీ అనే అక్షరాల విస్తరణ రూపం ఏమిటో చెప్పండని చిన్న ప్రశ్న వేసింది. దాంతో ఆయన చాలాసేపు ప్రయత్నం చేస్తూ చెప్పడానికి గింజుకున్నారు. నాకు తెలుసు.. కానీ గుర్తుకు రావడంలేదంటూ సమాధానమిచ్చారు. జీఎస్టీపై మరింత అవగాహన కోసం సంబంధిత పత్రాలు అన్నింటినీ అధ్యయనం చేస్తున్నాను అని కూడా చెప్పారు. అయినా ఏంలాభం? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే పూర్తి పేరును మాత్రం ఆయన చెప్పలేకపోయారు. దీన్నిబట్టి జీఎస్టీ గురించి ఇంకా ఎవరికీ పూర్తిగా తెలియకపోవటంతో అవగాహన కల్పించనున్నారు.