అతిలోక సుందరిగా దీపికా..!

SMTV Desk 2018-04-03 11:23:47  ntr biopic, balakrishna, sreedevi role, dipika padukone.

హైదరాబాద్, ఏప్రిల్ 3 : నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా దర్శకుడు తేజ ఓ చిత్రాన్ని తెరకెక్కి౦చనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధి౦చి ప్రధాన పాత్రలకు నటుల ఎంపికపై గట్టి కసరత్తే చేస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలిసి నటించిన వారిలో అతిలోక సుందరి శ్రీదేవి పాత్ర ఎంతో కీలకం. శ్రీదేవి ఎన్టీఆర్ తో బాల నటిగానే కాకుండా హీరోయిన్ గా కూడా నటించింది. దీంతో చిత్ర బృందం శ్రీదేవి పాత్ర కోసం స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పాత్రకు దీపికా పదుకొనే ను తీసుకోవాలని చిత్రబృందం యోచిస్తోంది. త్వరలోనే దీపికాను కలిసి ఈ పాత్ర చేసేలా ఒప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీదేవి లానే దీపికా కూడా సౌత్ లో పుట్టి పెరిగి బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ సాధించింది. ఆమె అయితేనే ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది అంటూ యూనిట్ సభ్యుడు ఒకరు తెలిపారు. దీపికాకు ఆఫర్ చేస్తోంది శ్రీదేవి పాత్ర కావడం.. అది కూడా చాలా చిన్న పాత్ర కావడంతో దీపికా ఒప్పుకుంటు౦దనే నమ్మకంతో చిత్రబృందం ఉంది. ఇక ఎన్టీఆర్ భార్య పాత్రకు బాలివుడ్ నటి విద్యాబాలన్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాత్రలు చేయడానికి ఈ బాలీవుడ్ భామలు ఒప్పుకుంటారో.. లేదో.! చూడాలి.