కేంద్రాన్నినిలదీసిన సుప్రీంకోర్టు

SMTV Desk 2018-04-02 16:18:44  AP reorganisation act, promises central government, supreme court

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, గిరిజన విశ్వవిద్యాలయం, పోలవరం ముంపుపై అధ్యయనం చేయడం వంటి విభజన హామీలను వెంటనే అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని గతంలో సుధాకర్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో న్యాయస్ధానం జారీ చేసిన నోటీసులకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాదులు హాజరైనా కేంద్రం స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇస్తామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.