గిన్నిస్ బుక్ లో నమోదుకు సర్వ మత యోగాసనాలు...

SMTV Desk 2017-05-29 11:59:28  yoga,yogaday,world yoga day,modi

లక్నో, మే 28 : భిన్న మతాలు, సాంస్కృతుల సమ్మేళనం అయిన భారత్ లో ప్రస్తుత సంవత్సరం యోగా దినోత్సవాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేసేందుకు సన్నద్దం చేస్తున్నారు. ముఖ్యంగా యోగా దినోత్సవంపై ముస్లింలలో ఉన్న అపోహలను తొలగించేందుకు రెండువేల మంది ముస్లిం మతపెద్దలతో పాటు ఇతర హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులు, జైనులు, యూదులు తదితర మతాల వారితో కలిసి యోగా దినోత్సవం సందర్భంగా యోగసనాలు వేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడితో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్ పాల్గొంటారు. జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించే విషయం తెలిసిందే. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేసేందుకు నిర్వహించే ఈ యోగాసనాల ప్రక్రియకు ఉత్తరప్రదేశ్ లోని లక్నో వేదిక కానుంది.